పోలింగ్‌కు ముందు నాటుబాంబులు లభ్యం... ఎన్ఐఏకు ఎన్నికల సంఘం కీలక సూచన

  • దక్షిణ పరగణాల జిల్లాలోని ఒక ఇంట్లో ఇటీవల నాటు బాంబులు లభ్యం
  • పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఐఏకు ఈసీ సూచన
  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఈసీ
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశలో జరగనున్న సమస్యాత్మక పోలింగ్ పోలింగ్ బూత్‌‍లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈడీకి కీలక సూచన చేసింది. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు రాష్ట్రంలో నాటు బాంబులు లభించడం, స్వల్ప పేలుడు ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రెండో దశ పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతను మోహరించింది.

కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, ఓటింగ్‌కు అంతరాయం కలిగించేందుకు దుండగులు బాంబులను ఉపయోగించే ప్రమాదం ఉందని ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు సూచించింది. రాష్ట్రంలో పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ తెలిపింది.

దక్షిణ పరగణాలు జిల్లాలోని భాంగర్ ప్రాంతంలో ఇటీవల ఒక ఇంట్లో నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఈ నెల 23న పోలింగ్ పూర్తయింది. మిగతా 142 స్థానాల్లో రేపు (ఏప్రిల్ 29) పోలింగ్ జరగనుంది.

EC asks NIA to ensure bombs not used to disrupt
EC to NIA

More Telugu News